మహేష్ సరసన అల్లు అర్జున్ భామ నా
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ సరసన అల్లు అర్జున్ భామ నా

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST
మహేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా కూడా చేయనున్నాడు . అది మహేష్ కి 24వ సినిమా కాగా 25 వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . సీనియర్ నిర్మాత అశ్వనీదత్ - దిల్ రాజు లు సంయుక్తంగా మహేష్ 25వ సినిమాని నిర్మించనున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలనీ చూస్తున్నారో తెలుసా ....... పూజా హెగ్డే . ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటిస్తోంది . ఆ భామనే మహేష్ సరసన అని ఫిక్స్ అయ్యారట దర్శక నిర్మాతలు . ఒకవేళ అదే నిజమైతే పూజా హెగ్డే జాతకం మారినట్లే.Comments

FOLLOW
 TOLLYWOOD