ముదురు భామకు గోల్డెన్ ఛాన్స్
TOLLYWOOD
 TOPSTORY

ముదురు భామకు గోల్డెన్ ఛాన్స్

Murali R | Published:November 16, 2017, 4:47 PM IST
30 ప్లస్ సుందరి పూజా కుమార్ కు గోల్డెన్ ఛాన్స్ లభించింది . గరుడ వేగ చిత్రంతో సంచలన విజయం సాధించిన పూజా కుమార్ కమల్ హాసన్ తో వరుసగా మూడు సినిమాల్లో నటించింది . తాజాగా గరుడ వేగ హిట్ కావడంతో మరోసారి ఈభామ కు మంచి ఛాన్స్ లు వస్తున్నాయి . ఎన్టీఆర్ బయోపిక్ పై రూపొందుతున్న వివాదాస్పద చిత్రం '' లక్ష్మీస్ ఎన్టీఆర్ '' . కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రంలో హీరోయిన్ గా రాయ్ లక్ష్మీ ని తీసుకోవాలని అనుకున్నారు ,రాయ్ లక్ష్మీ కూడా ఒప్పుకుంది కట్ చేస్తే డేట్స్ సమస్య వస్తుండటంతో రాయ్ లక్ష్మీ తప్పుకుంది దాంతో పూజా కుమార్ ని ఆ అవకాశం వరించింది.

పూజా కుమార్ కూడా ఛాన్స్ రావడమే ఆలస్యం వెంటనే ఒప్పేసుకుంది . లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదాస్పద చిత్రం కావడంతో తప్పకుండా మంచి మైలేజ్ వస్తుందని నమ్మకంగా ఉంది . ఒకవైపు హిట్ సినిమా మరోవైపు వివాదాస్పద చిత్రం ఒప్పుకోవడంతో సంతోషంగా ఉంది పూజా కుమార్.Comments

FOLLOW
 TOLLYWOOD