నీ అబ్బ అంటూ తిడుతున్నాడు
TOLLYWOOD
 TOPSTORY

నీ అబ్బ అంటూ తిడుతున్నాడు

Murali R | Published:November 21, 2017, 4:34 PM IST

నంది అవార్డులు రద్దు చేస్తావా ? అవి నీ అబ్బ సొత్తా ? అంటూ నారా లోకేష్ ని బండ బూతులు తిడుతున్నాడు పోసాని కృష్ణమురళి . అంతేకాదు టెంపర్ చిత్రంలో నటించినందుకు గాను పోసాని కి ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది దాంతో ఆ అవార్డు ని తీసుకోను ...... ఎందుకంటే నేను ఆ అవార్డు తీసుకుంటే కమ్మ అవార్డు అంటారు కాబట్టి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు పోసాని . నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేస్తున్నాయి . ఏ ముహూర్తాన నంది అవార్డులను ప్రకటించారో కానీ అప్పటి నుండి లొల్లి లొల్లి అవుతోంది.

అయితే ఈ వివాదం ఎక్కువ కావడంతో ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు , ఓటర్ కార్డు లేనివాళ్లు మాత్రమే రాద్ధాంతం చేస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించడంతో పోసాని కోపం నషాళానికి ఎక్కింది అంతే నారా లోకేష్ ని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పై తిట్ల వర్షం కురిపించాడు.
Comments

FOLLOW
 TOLLYWOOD