మెంటల్ మదిలో సినిమా బాగుందట
TOLLYWOOD
 TOPSTORY

మెంటల్ మదిలో సినిమా బాగుందట

Murali R | Published:November 19, 2017, 10:21 AM IST
శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం  మెంటల్ మదిలో. ఈనెల 24న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఇటీవలే పలువురు సినీ ప్రముఖులకు ప్రత్యేక షో వేశారు. ఈ షోకి హీరో రామ్ కూడా హాజరయ్యాడు. శ్రీ విష్ణు కోసం మొహమాటం తో సినిమా చూడటానికి వచ్చినప్పటికీ సినిమా బాగుండటంతో ఆ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని, తప్పకుండా చూడండి ఎంజాయ్ చేస్తారు అంటూ శ్రీ విష్ణు తో పాటు ఆ చిత్ర యూనిట్ కు ముందుగానే శుభాకాంక్షలు అందజేశాడు హీరో రామ్. 
 
 
 
ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో రామ్ , శ్రీ విష్ణు లు కలిసి నటించిన విషయం తెలిసిందే. రామ్ పాత్ర బాగున్నప్పటికి శ్రీ విష్ణు కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది ఉన్నది ఒకటే జిందగీ చిత్రం . శ్రీ విష్ణు చాలా సెలెక్టివ్ గా చిత్రాలను ఎంచుకుంటు వెళ్తున్నాడు. తాజాగా మెంటల్ మదిలో చిత్రానికి రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది, ఇక రేపు రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల ఆదరణ కూడా లభిస్తే మరో హిట్ కొట్టేసినట్లే .Comments

FOLLOW
 TOLLYWOOD