తమిళ్ లో దుమ్ము రేపుతున్న తారామణి
TOLLYWOOD
 TOPSTORY

తమిళ్ లో దుమ్ము రేపుతున్న తారామణి

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
అంజలి , ఆండ్రియా , వసంత్ రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం '' తారామణి '' . తమిళనాట నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా సూపర్ హిట్ టాక్ ని సైతం సొంతం చేసుకుంది . ఇక రివ్యూ లు కూడా తారామణి సినిమాకు అనుకూలంగా రావడంతో తెలుగులో ఈ సినిమాని సొంతం చేసుకున్న డివి సినీ క్రియేషన్స్ అధినేత డి . వెంకటేష్ చాలా సంతోషంగా ఉన్నాడు.

ఈ సందర్బంగా నిర్మాత డి . వెంకటేష్ మాట్లాడుతూ '' ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ తారామణి చిత్రానికి తమిళనాట అపూర్వ ఆదరణ లభిస్తోంది . యువత టెక్నాలజీ మాయలో పడి ఎలాంటి ప్రలోభాలకు లోనౌతున్నారు , దాని ఫలితంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను చక్కగా వివరించి యువత ని మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తారామణి రూపొందించారని , అందుకే అక్కడ ఘనవిజయం సాధిస్తోందని ....... తమిళం లో లాగే తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వాటిని త్వరలోనే పూర్తిచేసి ఈ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు డి . వెంకటేష్.



Comments

FOLLOW
 TOLLYWOOD