ప్రభాస్ ఛత్రపతి కి తమిళంలో డిమాండ్
TOLLYWOOD
 TOPSTORY

ప్రభాస్ ఛత్రపతి కి తమిళంలో డిమాండ్

Murali R | Published:October 11, 2017, 12:01 PM IST
బాహుబలి తో ప్రభాస్  రేంజ్ పెరిగింది దాంతో అంతకుముందు ప్రభాస్ నటించిన చిత్రాలకు అన్ని భాషలలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రభాస్ నటించిన సినిమాలను ఆయా భాషలలో డబ్ చేసి క్రేజ్ ని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఆ కోవలో ఛత్రపతి సినిమాని తమిళ్ లో చంద్రమౌళి గా డబ్ చేస్తున్నారు.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఛత్రపతి 2005 వ సంవత్సరం లో రిలీజ్ అయి అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతోనే ప్రభాస్ స్టార్ హీరో అయ్యాడు తెలుగులో . రేపు చంద్రమౌళి చిత్రం తమిళనాట రిలీజ్ కానుంది. ప్రభాస్ కు క్రేజ్ ఉంది కాబట్టి చంద్రమౌళి చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి . ఇక హిట్ అవుతుందా ? అంటే తమిళ ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD