ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వనున్న ప్రభాస్
TOLLYWOOD
 TOPSTORY

ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వనున్న ప్రభాస్

Murali R | Published:October 16, 2017, 6:14 PM IST
ఈనెల 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు ప్రభాస్ . ప్రస్తుతం సాహూ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు కాగా యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది . తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి . కాగా అభిమానులకు ప్రభాస్ రెడీ చేసిన గిఫ్ట్ ఏంటో తెలుసా ....... 

సరికొత్త ఫోటో షూట్ . బాహుబలి లో ప్రభాస్ ని ఒకలా చూసారు దాని తర్వాత సాహూ కోసం రెడీ అయిన ప్రభాస్ ఫోటోలను చూసారు కానీ పూర్తిస్థాయిలో ప్రభాస్ మెస్మరైజింగ్ ఫోటోలను చూడలేదు అభిమానులు అందుకే వాళ్ళ కోసం ఫోటో షూట్ చేసి మరీ అందిస్తున్నాడు . ఈనెల 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగానే ప్రభాస్ ఫోటోలు అభిమానుల కోసం రిలీజ్ చేయనున్నారు . ఇక మహిళా అభిమానుల కైతే ప్రభాస్ ఫోటో లు కైపెక్కించడం ఖాయం.Comments

FOLLOW
 TOLLYWOOD