ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథ బన్నీ కినచ్చింది
TOLLYWOOD
 TOPSTORY

ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథ బన్నీ కినచ్చింది

Murali R | Published:October 15, 2017, 10:35 AM IST
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసారు ఆ కథ ని కానీ ముగ్గురు హీరోలు ఒప్పుకోని కథ ని అల్లు అర్జున్ యాక్సెప్ట్ చేసి మరీ హిట్ కొట్టాడు అదే '' ఆర్య '' చిత్రం . సుకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన చిత్రం ఆర్య . అయితే ఆ కథ ని మొదట హీరో రవితేజ కు చెప్పారట కథ బాగుంది కానీ నాకు కరెక్ట్ కాదు అని ఆ సినిమా చేయడానికి నిరాకరించాడట దాంతో నితిన్ దగ్గరకు వెళ్ళింది సేమ్ నితిన్ కూడా అదే డైలాగ్ చెప్పడంతో ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది ఆర్య కథ . 
 
 
 
ప్రభాస్ కూడా ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు దాంతో అప్పుడు అల్లు అర్జున్ కు చెప్పారట అప్పట్లో అల్లు అర్జున్ కు అంతగా ఇమేజ్ లేదు దాంతో వెంటనే ఒప్పుకున్నాడు ....... సినిమా చేసాడు కట్ చేస్తే ఆర్య చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయ్యింది , అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టింది . ఇక ఇప్పుడు కూడా రవితేజ తో చేస్తున్న రాజా ది గ్రేట్ సినిమా కథ కూడా చాలామంది హీరోల దగ్గరకు వెళ్లిందట కానీ ఆ సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు ఎందుకంటే హీరో అంధుడు కాబట్టి . కానీ రవితేజ చేసాడు హిట్ కొడతాడు అని అంటున్నాడు దిల్ రాజు ......... చూడాలి ఈనెల 18న సినిమా రిలీజ్ అవుతోంది, ఏమౌతుందో మరి . Comments

FOLLOW
 TOLLYWOOD