ప్రభాస్ అవమానంగా భావించాడట
TOLLYWOOD
 TOPSTORY

ప్రభాస్ అవమానంగా భావించాడట

Murali R | Published:December 18, 2017, 4:57 AM IST

ప్రభాస్ కున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఓ మ్యాట్రిమోని సంస్థ ఓ కాన్సెప్ట్ ని రెడీ చేసి ప్రభాస్ కు వివరించిందట అయితే వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ప్రభాస్ ని అవమానించేలా ఉండటంతో 15 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఆ ఆఫర్ ని తిరస్కరించాడట . కేవలం ఓ యాడ్ లో నటిస్తే 15 కోట్ల ఆఫర్ అంటే చాలా ఎక్కువే కానీ ప్రభాస్ మాత్రం ఆ ఆఫర్ ని వద్దనుకున్నాడట.

 

ఇంతకీ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి ? ప్రభాస్ ఎందుకు తిరస్కరించాడో తెలుసా ........ ప్రభాస్ రాజదర్బార్ లో రాజసంగా నడుచుకుంటూ వస్తుంటే అతడ్ని వరించే వాళ్ళు ఎంతో ఉత్సుకత తో పోటీ పడుతుంటారు. ఇలాంటి పెళ్లికాని ఆజానుబాహుడు కావాలంటే మా మ్యాట్రిమోని ని మాత్రమే సంప్రదించండి అంటూ ప్రచారం చేస్తారట. అక్కడే ప్రభాస్ కు కాలింది ఎందుకంటే ప్రభాస్ కు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు కదా ! పైగా పెళ్లి కాని వాళ్ళ లిస్ట్ లో మొదటి పేరు ప్రభాస్ దే. కృష్ణంరాజు ఏమో ప్రభాస్ కు త్వరగా పెళ్లి చేయాలని భావిస్తున్నాడు కానీ ప్రభాస్ మాత్రం ఇంకా వాయిదా వేస్తూనే ఉన్నాడు.
Comments

FOLLOW
 TOLLYWOOD