రవితేజ కొడుకుని మహేష్ బాబు తో పోల్చాడు
TOLLYWOOD
 TOPSTORY

రవితేజ కొడుకుని మహేష్ బాబు తో పోల్చాడు

Murali R | Published:October 19, 2017, 3:50 PM IST
మహేష్ బాబు బాలనటుడి గా తెలుగు చలనచిత్ర రంగంలో పలు సంచలనాలు సృష్టించాడు . బాలనటుడి గా యాక్షన్ దృశ్యాలలో అద్భుతంగా రాణించడమే కాకుండా డ్యాన్స్ తో కూడా అదరగొట్టాడు . ముప్పయ్యేళ్ల క్రితం మహేష్ అంటే సంచలనం , పెద్దయ్యాకా డ్యాన్స్ అంతగా చేయడం లేదు కానీ బాల నటుడిగా మాత్రం స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని పొందాడు అప్పట్లో . కృష్ణ , రమేష్ బాబు లతో కలిసి పలు చిత్రాల్లో నటించాడు మహేష్ బాబు .  సరిగ్గా  మహేష్ బాబు లాంటి ఇమేజ్ రవితేజ కొడుకు మహాధన్ కు రావాలని కోరుకుంటున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు.

రవితేజ తాజాగా నటించిన చిత్రం '' రాజా ది గ్రేట్ '' , ఈ చిత్రంలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ ని రవితేజ కొడుకు మహాధన్ చేత చేయించారు . దర్శకులు అనిల్ రావిపూడి మహాధన్ చేత నటింప జేద్దాం అని అన్నప్పుడు మొదట రవితేజ ఒప్పుకోలేదట కానీ అనిల్ ఒత్తిడి వల్ల ఒప్పుకున్నాడు . కట్ చేస్తే అతడి క్యారెక్టర్ కు థియేటర్ లో మంచి స్పందన వస్తోంది అందుకే దిల్ రాజు అంటున్నాడు రవితేజ కొడుక్కి మహేష్ బాబు లాంటి ఇమేజ్ రావాలని.Comments

FOLLOW
 TOLLYWOOD