బ్యాంకుల్ని మోసం చేసిన నిర్మాత అరెస్ట్
TOLLYWOOD
 TOPSTORY

బ్యాంకుల్ని మోసం చేసిన నిర్మాత అరెస్ట్

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
అల్లరే అల్లరి అనే సినిమా తీసిన ఎస్ కే బషీద్ అనే నిర్మాత ని పోలీసులు అరెస్ట్ చేసారు . ఇతగాడు మొదటి నుండి బ్యాంక్ అధికారులను మోసం చేయడం లోన్ తీసుకోవడం వాటితో సినిమాలు తీయడం , జల్సాలు చేయడం అరెస్ట్ కావడం ఇప్పటివరకు పలుమార్లు పోలీసులు ఇతడ్ని అరెస్ట్ చేసారు కానీ బుద్ది మాత్రం రాలేదు . ఇప్పటికి కూడా దొంగ డాక్యుమెంట్ల తో బ్యాంక్ అధికారులను బురిడీ కొట్టించడం , లోన్ పొందడం చేస్తూనే ఉన్నాడు .
 
 

పదేళ్లుగా ఇతడి పని ఇదే కానీ బ్యాంక్ అధికారులు మాత్రం ఇలాంటి వాళ్లనే నమ్ముతూ లోన్ లు ఇస్తుంటారు , సిన్సియర్ గా లోన్ కోసం ట్రై చేస్తూ వ్యాపారం చేసి వృద్ధి లోకి వద్దామని తిరిగే వాళ్లకు మాత్రం లోన్ లు ఇవ్వరు సరికదా బ్యాంక్ చుట్టూ తిప్పించుకుంటారు అదే మోసం చేసే వాళ్లకు మాత్రం కుర్చీలు వేసి కూల్ డ్రింక్ లు తాగించి మరీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి లోన్ లను మంజూరు చేస్తారు ,తీరా మోసపోయామని పోలీసులను ఆశ్రయిస్తుంటారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD