ముస్లిం ప్రేమ కథతో సినిమా చేస్తాడట
TOLLYWOOD
 TOPSTORY

ముస్లిం ప్రేమ కథతో సినిమా చేస్తాడట

Murali R | Published:September 6, 2017, 12:00 AM IST
పూరి జగన్నాధ్ కు వరుసగా ప్లాప్ చిత్రాలు వస్తుండటం తో ఇక ఇప్పుడు ట్రాక్ మారుస్తానని పక్కా ప్రేమ కథా చిత్రం చేస్తానని అంటున్నాడు . తన తనయుడు పూరి ఆకాష్ హీరోగా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ముస్లిం - హిందూ ప్రేమ కథ అది కూడా పాకిస్థానీ అమ్మాయి - ఇండియా అబ్బాయి కథ చేయనున్నాడు పూరి జగన్నాధ్ . ఇటీవలే బాలకృష్ణ తో పైసా వసూల్ చిత్రాన్ని చేసాడు పూరి జగన్నాధ్ కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ప్రేమకథ చేయనున్నాడు . 
 
 

పూరి ఆకాష్ ఇంతకుముందే హీరోగా పరిచయం అయ్యాడు అయితే ఆ సినిమా ప్లాప్ అవడంతో ఇప్పుడు మళ్ళీ పూరి తన తనయుడి ని రీ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . తనకు అచ్చివచ్చిన ప్రేమకథ లను మళ్ళీ చేయాలనీ డిసైడ్ అయ్యాడట పూరి . అయితే పాకిస్థానీ అమ్మాయి అనగానే మళ్ళీ గన్స్ , మాఫియా ని కూడా చొప్పిస్తాడా ? చూడాలి . పూరి మారితే మంచిదే కానీ ఇప్పుడే ఆ పైత్యం దిగుతుందా ? 
Comments

FOLLOW
 TOLLYWOOD