3 ప్రాజెక్ట్ లతో సంచలనం సృష్టిస్తున్న పూరి
TOLLYWOOD
 TOPSTORY

3 ప్రాజెక్ట్ లతో సంచలనం సృష్టిస్తున్న పూరి

Murali R | Published:February 12, 2017, 12:00 AM IST
దర్శకులు పూరి జగన్నాధ్ మూడు ప్రాజెక్ట్ లను కమిట్ అయి సంచలనం సృష్టిస్తున్నాడు . నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన ఇజం అనుకున్నంత సక్సెస్ కాలేదు దాంతో ఇక పూరి జగన్నాధ్ పని అయిపోయినట్లే అని అనుకుంటున్న సమయంలో మూడు ప్రాజెక్ట్ లు పూరి దగ్గరకు రావడం పెద్ద సంచలనం అయ్యింది . తెలుగులో ఇంతకుముందు హీరో శ్రీకాంత్ తో మహాత్మ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన సి ఆర్ మనోహర్ పూరి జగన్నాధ్ తో వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్ లను చేయడానికి డీల్ కుదుర్చుకున్నాడు . అందులో ఒకటి తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న ''రోగ్ '' కాగా దాని తర్వాత విక్టరీ వెంకటేష్ తో మరో భారీ ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అలాగే వేంకటేష్ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ కూడా పూరి తోనే చేయనున్నాడు మనోహర్ నాయుడు . ముందుగా రోగ్ చిత్రాన్ని తెలుగు , కన్నడ భాషలలో భారీ ఎత్తున రిలీజ్ చేసాక వెంకటేష్ ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టనున్నాడు పూరి . మొత్తానికి పూరి జగన్నాధ్ కు ఇక సినిమాలు రావడం కష్టం అని అనుకుంటున్న సమయంలో మూడు ప్రాజెక్ట్ లు దగ్గరకు రావడం నిజంగా సంచలనమే.Comments

FOLLOW
 TOLLYWOOD