పూరి జగన్నాధ్ కూతురుకి కోపం వచ్చింది
TOLLYWOOD
 TOPSTORY

పూరి జగన్నాధ్ కూతురుకి కోపం వచ్చింది

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST
తన తండ్రి పూరి జగన్నాధ్ డ్రగ్స్ కి అలవాటు పడిన వ్యక్తిగా మీడియా చిత్రీకరించడాన్ని తప్పు పడుతోంది పూరి కూతురు పవిత్ర . తండ్రి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న పవిత్ర ఒక సినిమాలో కూడా నటించింది . అయితే డ్రగ్స్ మాఫియా లో నా తండ్రి ప్రమేయం లేదని అసలు నా తండ్రి ఓ సెలబ్రిటీ కాబట్టే ఇలా చేస్తున్నారని పట్టరాని ఆవేశంతో మీడియా పై నిప్పులు కక్కుతోంది పవిత్ర .
 
 

మీడియా పై పట్టరాని కోపంతో ఊగిపోతోంది పవిత్ర , మీడియా  వాళ్ళు చెప్పేది జనాలు అంతగా నమ్మరని కూడా అంటోంది . అయితే పోలీసులు కూడా అధికారికంగా పూరి జగన్నాధ్ పేరుని వెల్లడించలేదు కానీ అనధికారికంగా పూరి పేరు చెబుతున్నారు అంతేకాదు విచారణకు సహకరించాల్సిందిగా నోటీసు ని కూడా పంపించారు . పూరి జగన్నాధ్ మాత్రం పైసా వసూల్ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు . ఎప్పుడు స్పందిస్తాడో మరి ఈ విషయం పై . 
Comments

FOLLOW
 TOLLYWOOD