హీరోయిన్ రాగిణి కి షూటింగ్ లో గాయాలు
TOLLYWOOD
 TOPSTORY

హీరోయిన్ రాగిణి కి షూటింగ్ లో గాయాలు

Murali R | Published:November 22, 2017, 5:39 PM IST
షూటింగ్ లో గాయాలు పాలవడంతో కర్ణాటక హీరోయిన్ రాగిణి ద్వివేది  ని హుటా హుటిన అపోలో ఆసుపత్రి కి తరలించారు బెంగుళూర్ లో . కన్నడ నాట హాట్ భామ గా గుర్తింపు తెచ్చుకున్న రాగిణి ప్రస్తుతం '' ఎం ఎస్ సి హెచ్ '' అనే కన్నడ చిత్రంలో పోలిస్ అధికారిగా నటిస్తోంది . పవర్ ఫుల్ పోలిస్ అధికారి కావడంతో ఆమెపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు ముస్సంజే మహేష్ . అయితే యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో ఓ ఫైటర్ చేయి బలంగా రాగిణి చెవి ని తాకడంతో వెంటనే రక్తం వచ్చింది దాంతో హుటాహుటిన బెంగుళూర్ లోని అపోలో ఆసుపత్రి కి తరలించారు . 
 
 
అయితే రాగిణి కి పెద్దగా గాయాలు కాలేదు కానీ చెవి దగ్గర దెబ్బ తగలడంతో రక్తం కారింది . ఇక రాగిణి ఆసుపత్రి పాలయ్యింది అని తెలియగానే ఆమె అభిమానులు కంగారు పడ్డారు . డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం రాగిణి ఆరోగ్యం గురించి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారట . మొత్తానికి భారీ ప్రమాదం నుండి బయటపడింది రాగిణి ద్వివేది  . Comments

FOLLOW
 TOLLYWOOD