రాజ్ తరుణ్ ఇంట విషాదం
TOLLYWOOD
 TOPSTORY

రాజ్ తరుణ్ ఇంట విషాదం

Murali R | Published:October 15, 2017, 7:15 PM IST
యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇంట విషాదం నెలకొంది , అయితే విషాదం అనగానే ఏదో చేదు శకునం అనుకోవద్దు కానీ దాదాపుగా అలాంటిదే ! ఎందుకంటే రాజ్ తరుణ్ ఇంట్లో పెంపుడు కుక్క చనిపోయింది దాంతో ఈ హీరో తీవ్ర విషాదంలో ఉన్నాడు . రాజ్ తరుణ్ కు కుక్క లంటే చాలా చాలా ఇష్టం , ఈ హీరో తన ఇంట్లో డజన్ల కొద్దీ పెంపుడు కుక్కలను పెంచుతున్నాడు . అందులో ఒక కుక్క కు జబ్బు చేసి చనిపోయింది దాంతో రాజ్ తరుణ్ ఏడ్చుకుంటూ ఉండిపోయాడు . ఆ కుక్కతో తనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాడు రాజ్ తరుణ్ . 
 
 
హీరోగా సత్తా చాటిన రాజ్ తరుణ్ సున్నిత మనస్కుడు కావడంతో కుక్క చనిపోగానే దిగాలు పడిపోయాడు . మంచి సక్సెస్ లు సాధిస్తున్న ఈ హీరో ప్రస్తుతం సంజనా రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నాడు . ఆ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది . Comments

FOLLOW
 TOLLYWOOD