2 రోజుల్లో 26 కోట్ల ని రాబట్టిన రాజా ది గ్రేట్
TOLLYWOOD
 TOPSTORY

2 రోజుల్లో 26 కోట్ల ని రాబట్టిన రాజా ది గ్రేట్

Murali R | Published:October 21, 2017, 10:17 AM IST
మాస్ మహారాజ్ రవితేజ రీ ఎంట్రీ లో అదరగొట్టాడు . రాజా ది గ్రేట్ చిత్రంతో రెండు రోజుల్లోనే 26 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించి ఔరా ! అనిపించాడు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన రాజా ది గ్రేట్ చిత్రం దీపావళి కానుకగా ఈనెల 18న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మొదటి రోజున 12. 6 కోట్ల వసూళ్ల ని రాబట్టి రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది , ఇక నిన్న దీపావళి కావడంతో ఆ జోష్ మరింత పెరిగి 13. 8 కోట్ల ని వసూల్ చేసింది . దాంతో రెండు రోజుల్లో 26. 4 కోట్ల కలెక్షన్ల ని రాబట్టినట్లు అయ్యింది . 
 
 
రవితేజ అంధుడి గా నటించగా మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది . ఎంటర్ టైన్ మెంట్ కి పుష్కలంగా అవకాశం ఉండటంతో ప్రేక్షకులు కూడా రాజా ది గ్రేట్ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు . మొత్తానికి వసూళ్ల వర్షం చూస్తుంటే రవితేజ కు మరో సూపర్ హిట్ లభించినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . వీకెండ్ లో మంచి షేర్ ని రాబట్టేలా ఉంది ఈ రాజా ది గ్రేట్ . Comments

FOLLOW
 TOLLYWOOD