రాజమౌళి కి షాక్ ఇచ్చిన క్రిష్
TOLLYWOOD
 TOPSTORY

రాజమౌళి కి షాక్ ఇచ్చిన క్రిష్

Murali R | Published:January 11, 2017, 12:00 AM IST
బాలయ్య తో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేసిన దర్శకులు క్రిష్ కు మరో దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడట . సినిమా తీసేముందు గౌతమిపుత్ర శాతకర్ణి కథ జక్కన్న కు చెప్పాడట క్రిష్ అయితే కథ విన్న జక్కన్న చాలా బాగుందని చెప్పడమే కాకుండా నువ్ గ్రాఫిక్స్ పై ఎక్కువ ఆధారపడితే నీకు తిప్పలు తప్పవు కాబట్టి ఎక్కువగా లైవ్ లోనే షాట్స్ ఉండేలా చూసుకో లేకపోతే ఇబ్బందులు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చాడట . అంతేకాదు ఈ సినిమా అనుకున్న సమయంలో పూర్తిచేయాలనుకుంటే నువ్ నిద్ర పోకూడదు , ఇతరులను నిద్ర పోనివ్వ కూడదు అంటూ గట్టిగా చెప్పాడట .

బాహుబలి లాంటి దర్శకుడు ఆ మాటలు అనడంతో సరైన ప్లానింగ్ తో అనుకున్న సమయానికే షూటింగ్ , గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ చేసి జక్కన్నకు షాక్ ఇచ్చాడు . ట్రైలర్ చూసిన జక్కన్న ఇంత అద్భుతం ఎలా చేసావని షాక్ లోనే ప్రశ్నించాడట దాంతో మీరిచ్చిన సలహాలను పాటించి పక్కా ప్రణాళిక తో చేసానని చెప్పాడట క్రిష్ .Comments

FOLLOW
 TOLLYWOOD