నాని సినిమా కోసం రాజమౌళి
TOLLYWOOD
 TOPSTORY

నాని సినిమా కోసం రాజమౌళి

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST
నాని సినిమాని ఎంత తొందరగా చూస్తానన్న ఆత్రుత తో ఉన్నానని ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు . రాజమౌళి ట్వీట్ తో నాని సినిమాకు మరింత బూస్ట్ వచ్చినట్లే !  నాని తాజాగా '' నిన్ను కోరి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . నివేదా థామస్ నాని సరసన నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించగా డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు .
 
 

గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జులై 7న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ రాజమౌళి కి నచ్చడంతో ట్వీట్ చేసాడు అది నాని సినిమాకు బాగా హెల్ప్ అయ్యేలా ఉంది కూడా . ఇంతకుముందు రాజమౌళి తో నాని ఈగ చేసిన విషయం తెలిసిందే .
Comments

FOLLOW
 TOLLYWOOD