తారా చౌదరి తో ఆ సంబంధం లేదంటున్న రాజశేఖర్
TOLLYWOOD
 TOPSTORY

తారా చౌదరి తో ఆ సంబంధం లేదంటున్న రాజశేఖర్

Murali R | Published:November 12, 2017, 5:22 PM IST
తారా చౌదరి వివాదాస్పద మహిళ అన్న విషయం అందరికీ తెలిసిందే . కొన్నాళ్ల క్రితం వరకు తారా చౌదరి అన్నది పెద్ద సెన్సేషన్ రకరకాల వార్తలతో నిత్యం మీడియాలో నానుతూ ఉండేది అయితే కొంతకాలంగా తారా చౌదరి ఇష్యు సైలెంట్ అయిపొయింది . కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఆమె పేరు తెరమీదకు వచ్చింది ఎందుకో తెలుసా ........ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తో ఆమెకు ఏదో సంబంధం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి అప్పుడు రాజశేఖర్ పెద్దగా స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం స్పందించాడు ...... తారా చౌదరి తో పెద్దగా పరిచయం లేదని కేవలం రెండుసార్లు మాత్రమే కలిశానని అంతకు మించి ఎటువంటి సంబంధం లేదని అంటున్నాడు రాజశేఖర్.

అప్పట్లో రాజశేఖర్ పేరు కూడా వినిపించింది అలాగే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపించాయి అయితే పలుకుబడి ఉన్న నాయకులు కావడంతో వాళ్ళ పేర్లు మాయం అయ్యాయి . తారా చౌదరి తో ఒకేసారి ఫోటో దిగానని అంతేకాని అంతకుమించి ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు రాజశేఖర్ . గరుడ వేగ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రాజశేఖర్ మంచి జోష్ మీదున్నాడు.Comments

FOLLOW
 TOLLYWOOD