నలుగురు రజినీకాంత్ అభిమానుల కథ
TOLLYWOOD
 TOPSTORY

నలుగురు రజినీకాంత్ అభిమానుల కథ

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST

జ్యో స్టార్ ఎంట్రప్రెస్స్ పతాకం పై కబాలి సెల్వ  దర్శకత్వం లో  ఎం కోటేశ్వర రాజు నిర్మిస్తున్న చిత్రం 12-12-1950. సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమాని అయిన డైరెక్టర్ సెల్వ ఆయన పుట్టిన రోజు తారీఖు  12-12-1950 ను తన సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు. ఈ చిత్రం నలుగురు రజినీకాంత్ వీరాభిమానులు కథ. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ . రమేష్ తిలక్, తంబీ రామయ్య , యోగి బాబు , ఎం ఎస్ భాస్కర్, జాన్ విజయ్  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ సెల్వ ఈ చిత్రం రజినీకాంత్ గారి కబాలి క్యారెక్టర్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు సెల్వ మాట్లాడుతూ  "నేను రజినీకాంత్ వీరాభిమానిని, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండుగా రోజు. మేము అయన పుటిన రోజుని ప్రతిరోజు జరుపుకుంటాం . ఈ చిత్రం లోని హీరో రజినీకాంత్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో సినిమా చూస్తాడు అన్నది ముఖ్య కథ.  ఈ చిత్రం షూటింగ్ పూర్తీ అయింది. ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ లాంచ్ చేసాము. మా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో టీజర్ రిలీజ్ చేయబోతున్నాము. కామెడీ తో పాటు సినిమా చాల ఎమోషనల్ గ ఉంటుంది. ఆదిత్య - సూరియన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 72 శాతం కామెడీ 28 శాతం జి ఎస్ టి (గ్యాంగస్టర్, సెంటిమెంట్ మరియు థ్రిల్లర్ )". 

నటీనటులు : కబాలి సెల్వ, తంబీ రామయ్య , షఫీ, రమేష్ తిలక్, ఆధవం, అజయ్ ప్రశాంత్, యోగి బాబు, ఎం ఎస్ భాస్కర్, ఢిల్లీ గణేష్, జాన్ విజయ్ .Displaying IMG_6432.JPG
Comments

FOLLOW
 TOLLYWOOD