రజనీ ప్రధాని తో మాట్లాడతాడట
TOLLYWOOD
 TOPSTORY

రజనీ ప్రధాని తో మాట్లాడతాడట

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ని కలుస్తానని నదుల అనుసంధానం గురించి మాట్లాడతానని నదుల అనుసంధానం కోసం నిరసన తెలుపుతున్న  రైతులతో సమావేశంలో స్పష్టం చేసాడు . కొద్దిరోజులుగా కొంతమంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే . దాంతో ఆ రైతులకు మద్దతు ప్రకటించడమే కాకుండా కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించాడు రజనీకాంత్ .
 
 

ప్రస్తుతం '' కాలా '' చిత్రంలో నటిస్తున్న రజనీ గతకొంత కాలంగా అభిమానులతో సమావేశం అవుతూ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాడు . రజనీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 12న కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమని ఫీలర్లు వస్తున్నాయి . అలాగే బిజెపి లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు . మొత్తానికి రజనీ రాజకీయ రంగప్రవేశం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు .
Comments

FOLLOW
 TOLLYWOOD