రజనీకాంత్ మెచ్చిన తారామణి
TOLLYWOOD
 TOPSTORY

రజనీకాంత్ మెచ్చిన తారామణి

Murali R | Published:August 17, 2017, 12:00 AM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ తారామణి చిత్ర బృందాన్ని అభినందించాడు . ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి . తమిళనాట మంచి వసూళ్ల ని సాధిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా రజనీకాంత్ చూసాడు . సినిమా తనకు బాగా నచ్చడంతో వెంటనే ఆ చిత్ర యూనిట్ కు కబురు అందించి ఇంటికి పిలిపించుకున్నాడు . తారామణి అద్భుతంగా ఉందని దర్శక నిర్మాతలను నటీనటులను అభినందనలతో ముంచెత్తాడట రజనీకాంత్ .
 

సూపర్ స్టార్ రజనీకాంత్ తారామణి చిత్ర బృందాన్ని అభినందించడంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది . ఒకవైపు ప్రేక్షకుల ఆదరణ మరోవైపు విమర్శకుల ప్రశంసలు వీటితో పాటు రజనీ ప్రశంసలు దక్కడంతో సంతోషంగా ఉన్నారు . ఇక ఈ సినిమాని తెలుగులో యువ నిర్మాత డి . వెంకటేష్ అందిస్తున్నారు . తమిళంలో మంచి హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని నమ్మకంగా ఉన్నాడు వెంకటేష్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD