రాజుగారి గది 2 ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే
TOLLYWOOD
 TOPSTORY

రాజుగారి గది 2 ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే

Murali R | Published:October 13, 2017, 9:03 AM IST
కింగ్ నాగార్జున మెంటలిస్ట్ గా నటించిన చిత్రం రాజుగారి గది 2 . సమంత ఆత్మ గా నటించిన ఈ చిత్రంలో హాట్ భామ సీరత్ కపూర్ బికినీ అందాలు హైలెట్ గా నిలవనున్నాయట . ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రాజుగారి గది 2 రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కూడా పూర్తయ్యాయి. రాజుగారి గది 2 ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో తెలుసా .........
 
 
 
ఫస్టాఫ్ అంతా సరదాగా సాగుతూ దెయ్యం హడావుడి తో కాస్త భయపెడుతూ సెకండాఫ్ లో క్లైమాక్స్ కి వచ్చేసరికి రివేంజ్ డ్రామా గా మారిపోతుంది. సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుందట , నాగార్జున మెంటలిస్ట్ గా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. సీరత్ కపూర్ అందాలు కుర్రాళ్లకు కనువిందే అయితే మొదటి నుండి చెబుతున్నట్లుగా ఇది గొప్పగా ఏం లేదు కానీ అంతగా తీసిపడేసే సినిమా కూడా కాదు మొత్తానికి ఓ మాదిరి హిట్ అని అంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది గంటలు ఎదురుచూడాల్సిందే. బుల్లితెర అన్నయ్య ఓంకార్ దర్శకత్వం వహించిన చిత్రం ఈ రాజుగారి గది 2. Comments

FOLLOW
 TOLLYWOOD