25 కోట్ల షేర్ వస్తే రాజుగారి గది 2 హిట్
TOLLYWOOD
 TOPSTORY

25 కోట్ల షేర్ వస్తే రాజుగారి గది 2 హిట్

Murali R | Published:October 12, 2017, 7:42 PM IST
రేపు ప్రపంచ వ్యాప్తంగా కింగ్ నాగార్జున నటించిన రాజుగారి గది 2 రిలీజ్ అవుతోంది . ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం రీమేక్ . అయితే కొన్ని మార్పులు చేసి తెలుగులో నిర్మించారు , నాగార్జున కీలక పాత్ర పోషించగా హాట్ భామ సీరత్ కపూర్ బికినీ అందాలు ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి . ఇప్పటికే సీరత్ బికినీ స్టిల్స్ కేక పుట్టిస్తున్నాయి . సమంత ఆత్మ గా నటించి భయపెట్టనుంది.

అయితే ఏఎస్ సినిమాకు 24 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది దాంతో బయ్యర్లు కూడా లాభాల బాటలోకి వెళ్లాలంటే 25 కోట్ల షేర్ రాబట్టాలి అంటే గ్రాస్ 50 కోట్లకు పైగా వసూల్ చేయాలి . సీనియర్ హీరో నాగార్జున హిట్ లు కొడుతున్నాడు కానీ 25 కోట్ల పై షేర్ రావడం అంటే కొంత కష్టమే మరి . నిర్మాతలకు లాభాలు వచ్చాయి , ఇక రావాల్సింది బయ్యర్లకు . రేపు రిలీజ్ అవుతున్న రాజుగారి గది 2 పై అంచనాలు బాగానే ఉన్నాయి మరి . ప్రేక్షకులకు నచ్చితే హిట్టే ! లేకపోతేనే కొంచెం కష్టం.Comments

FOLLOW
 TOLLYWOOD