కార్తీ ఖాకీ కి ప్రశంసలు - రకుల్
TOLLYWOOD
 TOPSTORY

కార్తీ ఖాకీ కి ప్రశంసలు - రకుల్

Murali R | Published:November 18, 2017, 12:39 PM IST
కార్తీ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖాకీ చిత్రానికి అన్ని వర్గాల నుండి ప్రశంసలు వస్తున్నాయని , రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయని ముఖ్యంగా తమిళ్ వెర్షన్ కు కూడా హ్యూజ్ రెస్పాన్ వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేసింది రకుల్ ప్రీత్ సింగ్ . నా పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బెటర్ చేశానని పేరు కూడా బాగా వచ్చిందని అంటోంది రకుల్. 
 
 
 
 
అయితే నా పాత్ర గురించి పెద్దగా ఏమి లేదని రివ్యూస్ లో రాసారు కానీ ఆ పాత్ర నిడివి తక్కువ నాకిచ్చిన పాత్ర చేసాను అంటూ ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పింది. కార్తీ విభిన్న తరహా పాత్రలను పోషిస్తూ తన ఇమేజ్ ని పెంచుకుంటున్నాడు , కార్తీ తోనే  మరో సినిమా చేయనున్నాను అలాగే సూర్య తో కూడా ఒక సినిమాలో నటించే అవకాశం ఉందని స్పష్టం చేసింది రకుల్ ప్రీత్ సింగ్ . Comments

FOLLOW
 TOLLYWOOD