రకుల్ తప్పు చేస్తోందా
TOLLYWOOD
 TOPSTORY

రకుల్ తప్పు చేస్తోందా

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగునాట స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ భామకు ఒక్క తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగొందాలని ఆశపడుతోంది . ఇప్పటికే ఆ ప్రయత్నం చేసింది కూడా ఈ ఉత్తరాది భామ అయితే రకుల్ బాలీవుడ్ లో నటించిన '' యారియాన్ '' రిలీజ్ అయ్యింది కానీ ప్లాప్ అయ్యింది కూడా . అయితే ఈ భామ ఆశలు మాత్రం చావలేదు బాలీవుడ్ లో సక్సెస్ కావాలని ఆరాట పడుతూనే ఉంది . 
 
 

తాజాగా ఈ భామకు సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చిందట దాంతో రకుల్ ఉబ్బి తబ్బిబ్బై పోతోంది . అయితే తెలుగులో స్టార్ అయిన రకుల్ అక్కడికి వెళ్లి తాప్సి , ఇలియానా , తమన్నా లాగా ప్లాప్ అయితే మొదటికే మోసం వస్తుంది సుమా . 
Comments

FOLLOW
 TOLLYWOOD