అర్జున్ రెడ్డి దర్శకుడితో చరణ్ సినిమా
TOLLYWOOD
 TOPSTORY

అర్జున్ రెడ్డి దర్శకుడితో చరణ్ సినిమా

Murali R | Published:December 15, 2017, 4:32 AM IST
అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా సంచలన వ్యక్తి అయిపోయాడు దర్శకుడు వంగ సందీప్ రెడ్డి . తక్కువ బడ్జెట్ లో తీసిన అర్జున్ రెడ్డి భారీ విజయాన్ని సాధించడమే కాకుండా భారీ వసూళ్ల ని కొల్లగొట్టింది దాంతో అతడితో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు , నిర్మాతలు పోటీపడుతున్నారు . తాజాగా ఈ దర్శకుడి తో పని చేయడానికి శర్వానంద్ పోటీ పడుతుండగా ఆ దారిలోనే ఉన్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ . తాజాగా తన ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఎన్టీఆర్ తో పాటు శర్వానంద్ ని అలాగే సందీప్ రెడ్డి ని ఆహ్వానించాడు చరణ్ . 
 
దాంతో చరణ్ - సందీప్ రెడ్డి ల కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని అంటున్నారు . ప్రస్తుతం చరణ్ రంగస్థలం చిత్రం చేస్తున్నాడు దాని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా అలాగే ఎన్టీఆర్  జక్కన్న లతో కలసి ఒక సినిమా చేయనున్నాడు . దాని తర్వాత ఒకవేళ ఈ అర్జున్ రెడ్డి దర్శకుడి తో సినిమా ఉండొచ్చు . ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే సంచలనమే !Comments

FOLLOW
 TOLLYWOOD