బాబాయ్ కి అండగా రాంచరణ్
TOLLYWOOD
 TOPSTORY

బాబాయ్ కి అండగా రాంచరణ్

Murali R | Published:December 11, 2017, 5:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని , వచ్చే ఎన్నికల్లో బాబాయ్ పార్టీ జనసేన తరుపున ప్రచారం చేయాలని భావిస్తున్నాడట అబ్బాయ్ రాంచరణ్ తేజ్. జనసేన తరుపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని , అభ్యర్థులను నిలబెడతామని పవన్ స్పష్టం చేసిన నేపథ్యంలో బాబాయ్ కి అండగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట చరణ్ . అయితే బాబాయ్ తో కానీ నాన్న చిరంజీవితో కానీ ఈ విషయం చరణ్ ఇంకా చర్చించలేదట .

 

త్వరలోనే చిరంజీవి తో అలాగే బాబాయ్ లు నాగబాబు , పవన్ కళ్యాణ్ లతో చర్చించి ప్రచారం పై నిర్ణయం తీసుకోనున్నాడట చరణ్. ప్రజారాజ్యం సమయంలో విఫలం అయినప్పటికీ జనసేన విషయంలో మాత్రం విఫలం కావద్దని గట్టిగా నిర్ణయించుకున్నారట . ప్రస్తుతం చరణ్ రంగస్థలం చిత్రంలో నటిస్తున్నాడు . అలాగే సైరా .... నరసింహారెడ్డి నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు చరణ్ .
Comments

FOLLOW
 TOLLYWOOD