మైండ్ దొబ్బింది నిజమేనట
TOLLYWOOD
 TOPSTORY

మైండ్ దొబ్బింది నిజమేనట

Murali R | Published:November 20, 2017, 2:50 PM IST

రాంగోపాల్ వర్మ కు మైండ్ దొబ్బిందని చాలారోజులుగా నా గురించి రాస్తున్నారు ........ అది నిజమే ! అని సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . నాకు మైండ్ దొబ్బింది కానీ జ్యూస్ మాత్రం పోలేదు అది నిరూపించడానికే నాగార్జున తో సినిమా చేస్తున్నానని నన్ను నాగ్ బాగా నమ్మాడని ,నాకు కావలసినంత ఫ్రీడం ఇచ్చాడని అంటున్నాడు వర్మ . 28 ఏళ్ల క్రితం శివ తో సంచలనం సృష్టించారు నాగార్జున - రాంగోపాల్ వర్మ లు . అయితే శివ తెలుగు చలన చిత్ర చరిత్ర ని మార్చిన చిత్రమే అయినప్పటికీ ఆ సినిమా తర్వాత నాగార్జున - వర్మ లు చేసిన గోవిందా గోవిందా , అంతం చిత్రాలు డిజాస్టర్ లు అయ్యాయి.

దాంతో మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు . ఇక వర్మ ఇతర చిత్రాలు బోలెడు చేసాడు కానీ అందులో పెద్దగా ఆడిన సినిమాలు పెద్దగా లేవు పైగా ఇటీవలి కాలంలో పరమ చెత్త సినిమాలు చేసాడు . మరి అలాంటి వర్మ కు నాగార్జున సినిమా ఇవ్వడం షాకింగ్ న్యూసే . మరి ఈ సినిమా ఏమౌతుందో చూడాలి.
Comments

FOLLOW
 TOLLYWOOD