నేనేరాజు నేనే మంత్రి రిలీజ్ ఆగిపోయింది
TOLLYWOOD
 TOPSTORY

నేనేరాజు నేనే మంత్రి రిలీజ్ ఆగిపోయింది

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
రానా హీరోగా నటించిన నేనేరాజు నేనే మంత్రి సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే మీరు అనుకున్నట్లు తెలుగులో కాదు సుమా ! తమిళంలో . రానా కు బాహుబలి వల్ల తమిళనాట కూడా మంచి మార్కెట్ ఏర్పడిన విషయం తెలిసిందే.
 

దాంతో నేనేరాజు నేనే మంత్రి సినిమాని తెలుగు తో పాటుగా తమిళంలో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే రేపు రిలీజ్ కావాల్సిన తమిళ వెర్షన్ సడెన్ గా ఆగిపోయింది. వచ్చేవారం అక్కడ రిలీజ్ కానుంది . తెలుగులో మాత్రం రేపు రిలీజ్ అవుతోంది. 
Comments

FOLLOW
 TOLLYWOOD