రేటు పెంచిన రవితేజ
TOLLYWOOD
 TOPSTORY

రేటు పెంచిన రవితేజ

Murali R | Published:December 16, 2017, 2:38 PM IST

మాస్ మహరాజ్ రవితేజ తాజాగా రాజా ది గ్రేట్ చిత్రంతో హిట్ కొట్టాడు దాంతో తన రేటు అమాంతం పెంచాడట . రవితేజ కు హిట్ రాగానే అతడితో సినిమాలు నిర్మించడానికి చాలామంది ముందుకు వస్తున్నారు అయితే రవితేజ రెమ్యునరేషన్ విని షాక్ అవుతున్నారట . 7 నుండి 8 కోట్లు తీసుకునే రవితేజ ఏకంగా ఇప్పుడు 10 కోట్ల రూపాయలకు పెంచాడట.

 

ఒకేసారి భారీగా రెమ్యునరేషన్ పెంచడం సరికాదని కొంతమంది నిర్మాతలు అన్నారట కూడా కానీ రవితేజ వింటేగా ..... నాతో సినిమా చేయాలనుకుంటే నేను అడిగే సొమ్ము ఇవ్వాల్సిందే తప్ప మరో మాటకు అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పాడట. నేను హీరో ని కాకముందు తక్కువ రూపాయలకే పనిచేశాను , అప్పుడు ఎవరూ అంత తక్కువ డబ్బుల కె ఎందుకు పని చేస్తున్నావ్ అని ఎవరూ అడగలేదే ..... నాకు మాటలు వినిపించవ్ డబ్బులు మాత్రమే కావాలి అని అన్నాడట.
Comments

FOLLOW
 TOLLYWOOD