తమిళ హిట్ చిత్ర రీమేక్ లో రవితేజ
TOLLYWOOD
 TOPSTORY

తమిళ హిట్ చిత్ర రీమేక్ లో రవితేజ

Tuesday September 12th 2017
తమిళనాట సంచలన విజయాన్ని సాధించిన భోగన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ . తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ని తెలుగులో కూడా డైరెక్టర్ గా పరిచయం చేయనున్నాడు రవితేజ . ఇప్పటికే రవితేజ స్పీడ్ పెంచి వరుసగా రెండు సినిమాలు చేస్తుండగా రాజా ది గ్రేట్ సినిమాని రిలీజ్ కి కూడా సిద్ధం చేసాడు . ఇక అది రిలీజ్ కాగానే తమిళ రీమేక్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు .
 
 

ఆ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ లు కాగా ఒకరు హాట్ భామ కేథరిన్ ట్రెసా ని ఎంపిక చేయగా  తాజాగా రెండో హీరోయిన్ ని కూడా ఎంపిక చేసారు . తెలుగులో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో నటించిన '' తాన్యాహోప్ '' ని ఎంపిక చేసారు . రాజా ది గ్రేట్ అక్టోబర్ 13న రిలీజ్ కానుంది . ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో అంధుడి గా ఆకట్టుకున్నాడు రవితేజ .Comments

FOLLOW
 TOLLYWOOD