రవితేజ కొత్త సినిమా ఎప్పటి నుండో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

రవితేజ కొత్త సినిమా ఎప్పటి నుండో తెలుసా

Murali R | Published:October 25, 2017, 7:16 PM IST
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ ఇటీవలే రిలీజ్ అయి హిట్ అయ్యింది దాంతో మళ్ళీ రవితేజ లో సరికొత్త జోష్ మొదలయ్యింది . రాజా ది గ్రేట్ హిట్ కాగా  ఇప్పుడు '' టచ్ చేసి చూడు '' సినిమా చేస్తున్నాడు .  ఈ సినిమా వరుసగా మరో రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు . తమిళంలో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు అలాగే దర్శకులు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు రవితేజ . ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా మూడు కూడా హిట్ అయ్యాయి.

మొదట నీ కోసం అనే సినిమా చేసారు , అది హిట్ అయ్యింది దాంతో అటు రవితేజ కు ఇటు శ్రీను వైట్ల కు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ఈ ఇద్దరూ కెరీర్ పరంగా పుంజుకున్నారు . నీకోసం తర్వాత వెంకీ చేసారు సూపర్ హిట్ అయ్యింది దాని తర్వాత దుబాయ్ శీను చేసారు అది కూడా సూపర్ హిట్ అయ్యింది . రవితేజ - శ్రీను వైట్ల చేసిన మూడు సినిమాలు కూడా హిట్ అయ్యాయి కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేయలేదు కట్ చేస్తే ఇన్నాళ్లకు సినిమా చేయబోతున్నారు . వచ్చే ఏడాది జనవరి నుండి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు .Comments

FOLLOW
 TOLLYWOOD