రవితేజ సినిమా వాయిదా పడింది
TOLLYWOOD
 TOPSTORY

రవితేజ సినిమా వాయిదా పడింది

Murali R | Published:December 14, 2017, 5:46 AM IST

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టచ్ చేసి చూడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, సీరత్ కపూర్ లు రవితేజ సరసన నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సంక్రాంతి పోటీ లో ఇప్పటికే పలు చిత్రాలు ఉన్నాయి దాంతో తమ సినిమాని వాయిదా వేయడమే మంచిదని భావిస్తున్నారు.

 

సంక్రాంతి కి పోటీ పడితే థియేటర్ ల సమస్య వస్తుంది దాని వల్ల సరైన థియేటర్ లు దొరక్క కలెక్షన్లు కూడా తగ్గుతాయి. రెంటికి చెడిన రెవడిలా అయ్యే బదులు కాస్త గ్యాప్ ఇచ్చి వస్తే బాగుంటుందని టచ్ చేసి చూడు చిత్రాన్ని వాయిదా వేస్తున్నారట. కొంతకాలం గ్యాప్ తర్వాత రవితేజ చేసిన రాజా ది గ్రేట్ హిట్ అవ్వడంతో టచ్ చేసి చూడు పై అంచనాలు నెలకొన్నాయి.
Comments

FOLLOW
 TOLLYWOOD