రాజా ది గ్రేట్ ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

రాజా ది గ్రేట్ ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో తెలుసా

Murali R | Published:October 18, 2017, 9:38 AM IST
మాస్ మహారాజ్ రవితేజ నుండి  దాదాపు రెండేళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రం '' రాజా ది గ్రేట్ ''. బెంగాల్ టైగర్ చిత్రం 2015 డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది దాని తర్వాత రవితేజ నుండి మరే సినిమా రాలేదు . దాదాపుగా రెండేళ్ల కాలం తర్వాత రవితేజ చేసిన చిత్రం ఈ రాజా ది గ్రేట్ . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ అంధుడి గా నటించాడు . ఇక ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది రాజా ది గ్రేట్ చిత్రం . ఓవర్సీస్ లో అయితే ఏకంగా ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి . ఆ ప్రీమియర్ షోల టాక్ ప్రకారం రాజా ది గ్రేట్ ఎలా ఉందో తెలుసా ........

రవితేజ అంధుడి గా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా నవ్వులలో ముంచెత్తి యాక్షన్ తో కూడా అలరించాడట దాంతో ఈ సినిమాకు ఓవర్సీస్ లో హిట్ టాక్ వచ్చింది . ఫస్టాఫ్ ఎంటర్ టైన్మెంట్ తో సాగగా సెకండాఫ్ కాస్త తేలిపోయిందని అయితే ఎంటర్ టైన్మెంట్ పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు . ఓవరాల్ గా రాజా ది గ్రేట్ హిట్ టాక్ తెచ్చుకుంది . అనిల్ రావిపూడి చేసిన రెండు సినిమాలు పటాస్ , సుప్రీమ్ లు కూడా ఎంటర్ టైన్మెంట్ వేలోనే సాగాయి . అదే దారిలో ఈ మూడో సినిమా కూడా తీసాడట . ఓవర్సీస్ టాక్ బాగానే ఉంది కాబట్టి ఇక్కడ కూడా హిట్ అయినట్లే !Comments

FOLLOW
 TOLLYWOOD