రియల్ స్టార్ శ్రీహరి భార్య మేనకోడలు అదృశ్యం
TOLLYWOOD
 TOPSTORY

రియల్ స్టార్ శ్రీహరి భార్య మేనకోడలు అదృశ్యం

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి బంధువు చెన్నైలో అదృశ్యం కావడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది . శ్రీహరి భార్య శాంతి కి మేనకోడలు అవుతుంది అదృశ్యమైన అబ్రిన్ (17) . శాంతి సోదరుడు అరుణ్ మొలివర్మన్ చెన్నై లో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు . అతడికి అబ్రిన్ కూతురు అంటే శాంతి శ్రీహరి కి మేనకోడలు అన్నమాట . టి , నగర్ లో ఉంటున్న అబ్రిన్ సెప్టెంబర్ 6న పాఠశాల కు వెళ్ళింది అయితే ఇంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తెలిసిన బంధు మిత్రుల ఇళ్లలో వాకబు చేసారు కానీ అబ్రిన్ జాడ తెలియకపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు . 
 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . విచిత్రం ఏంటంటే పాఠశాల ఆవరణలో మొత్తం యాభై సిసి కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడం . దాంతో పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్ గా మారింది . యుక్త వయసుకి వచ్చిన అమ్మాయి కావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు .Comments

FOLLOW
 TOLLYWOOD