రేణు ని పెళ్లి చేసుకోకుండా భయపెడుతున్న పవన్ ఫ్యాన్స్
TOLLYWOOD
 TOPSTORY

రేణు ని పెళ్లి చేసుకోకుండా భయపెడుతున్న పవన్ ఫ్యాన్స్

Murali R | Published:November 13, 2017, 9:09 AM IST
రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుండి విడిపోయి వేరుగా ఉంటున్న విషయం తెలిసిందే . పూణే లో తన ఇద్దరు పిలల్లతో కలిసి ఉంటోంది రేణు అయితే ఆమధ్య రేణు దేశాయ్ కి ఆరోగ్యం బాగోలేని సమయంలో ఒంటరి జీవితం పై విరక్తి కలిగిందట దాంతో మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుందట ఇదే విషయాన్నీ బయట చెప్పేసరికి ఆమెని బెదిరిస్తున్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . ఎలా పెళ్లి చేసుకుంటావో మేము చూస్తాం , ఎవడినైతే పెళ్లి చేసుకుంటావో వాడి అంతు చూస్తాం అంటూ రేణు దేశాయ్ కి వార్నింగ్ లు ఇచ్చారట దాంతో రేణు దేశాయ్ కాస్త భయపడింది . 
 
 
తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇదే విషయాన్నీ ప్రస్తావించింది కూడా . నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే ఫ్యాన్స్ అనవసరంగా వార్నింగ్ లు ఇస్తున్నారని అది వారి విజ్ఞత కే వదిలేస్తున్నామని పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయమని నేనెవరికి భయపడేది లేదని స్పష్టం చేసింది . మగాళ్లు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు కానీ ఆడది రెండో పెళ్లి చేసుకుంటే తప్పా అని ఎదురు ప్రశ్నించింది కూడా . అలాగే విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ పేద మొత్తంలో డబ్బులు , ఆస్థులు ఇచ్చినట్లు చెబుతున్నారు కానీ అదంతా వట్టి అబద్దమే అని కుండబద్దలు కొట్టింది రేణు దేశాయ్ . Comments

FOLLOW
 TOLLYWOOD