యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న ఆర్.కే గౌడ్
TOLLYWOOD
 TOPSTORY

యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న ఆర్.కే గౌడ్

Murali R | Published:October 25, 2017, 6:26 PM IST
ఆర్.కె. ఫిల్మ్స్ ప‌తాకం పై సౌజిత్,సుకుమార్,రోష‌న్,ఐశ్వ‌ర్య‌,శ్రావ‌ణి,లిఖిత‌ హీరో హీరోయిన్లుగా నూత‌న‌ ద‌ర్శ‌కుడు సురేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఐ.పి.ఎల్. ఇట్స్ అ ప్యూర్ ల‌వ్ స్టోరి అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు ఈ చిత్రం ఇటీవ‌ల‌ తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ లో ప్రారంభించారు ఈ చిత్రం హీరో,హీరోయిన్ల‌ మీద‌ ఫ‌స్ట్ షాట్ తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ ఇవ్వ‌గా తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ సెక్ర‌ట‌రి సాయి వెంక‌ట్ కెమ‌రా స్విచ్ ఆన్ చేసారు...

రామ‌క్రిష్ణ‌ గౌడ్ మాట్లాడుతూ...సురేష్ డైరెక్ట‌ర్   గారు ఒక‌ మంచి స‌బ్జెక్ట్ తో క్రికెట్ బెట్టింగ్ పైన‌ ఎంతో మంది యువ‌త‌ పాడైపోతున్నారు దాన్ని ద్రుష్టిలో పెట్టుకొని క‌థ‌ను తెచ్చారు కాబ‌ట్టి నేను ఇలాంటి క్రొత్త‌ డైరెక్ట‌ర్ ల‌కు ఆర్టిస్ట్ ల‌కు స‌హ‌క‌రించాల‌నే ఉద్దేశంతో నేను స‌పోర్ట్ చేస్తున్నాను ఇందులో హీరో,హీరోయిన్స్ అంద‌రు క్రొత్త‌వారు శ్యామ‌ల‌ అనే ఆర్టిస్ట్ మాత్రం మ‌రో శ‌కుంత‌ల‌ క్యారెక్ట‌ర్ చేస్తుంది అలాగే జ‌బ‌ర్ద‌స్త్ అప్ప‌రావు వీరంద‌రు సీనియ‌ర్స్ ఉన్నారు కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఈ సినిమా మంచి విజ‌యం సాదిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది అందుకే నేను ఈ సినిమా లో చేస్తున్న‌ ఆర్టిస్ట్ ల‌ అంద‌రికి మంచి జ‌ర‌గాల‌ని కోరుకు‍టున్నాను క‌థ‌ బాగుంది కాబ‌ట్టి ప్ర‌స్తుతం యువ‌త‌ బెట్టింగ్ కి బానిస‌లై చాలా మంది న‌ష్ట‌పోతున్నారు ఈ మ‌ద్య‌ చాలా మంది సూసైడ్ చేసుకోవ‌డం కూడా జ‌రిగింది ఈ సినిమా ద్వారా యువ‌త‌కు ల‌వ‌ర్స్ కి ఒక‌ మంచి మెస్సేజ్ ఇవ్వ‌బోతున్నాం ఈ ఐ.పి.ఎల్. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద‌ స‌క్సెస్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది ఇలాంటి క‌థ‌లు  తీసుకొని వ‌చ్చే క్రొత్త‌ డైరెక్ట‌ర్స్ కి క్రొత్త‌ హీరో హీరొయిన్స్ కి ఎల్ల‌ప్పుడూ తెలంగాణ‌ ఫిల్మ్ చాంబర్ స‌పోర్ట్ గా ఉంటుంద‌ని అలాగే మా చాంబ‌ర్ ద్వారా పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని అదే ఉద్దేశంగా ఈ సినిమాకి కూడా చేస్తున్నాం అన్నారు...

తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ సెక్ర‌ట‌రి సాయివెంక‌ట్ మాట్లాడుతూ...ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారు క్రొత్త‌ డైరెక్ట‌ర్స్ హీరో,హీరోయిన్స్ కి ప‌రిచ‌యం చేస్తామ‌నే ఉద్దేశం తో ఒక‌ మంచి యూత్ కి ఉప‌యోగ‌ప‌డే క‌థ‌ను తీసుకొని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషం అలాగే  ఇంకా ఎవ‌రైన‌ క్రొత్త‌ మంచి క‌థ‌లు తీసుకొస్తే వారికి మా చాంబ‌ర్ త‌రుపున‌ మా పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తాం అన్నారు...

జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు మాట్లాడుతూ... ప్ర‌తిభ‌ ఉండి అవకాశాలు లేన‌టువంటి వాళ్ళ‌కి ఒక‌ గొప్ప‌ ఆశీర్వాదం ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారు సురేష్ కి ఒక‌ మంచి అవ‌కాశాన్ని ఇచ్చి ఐ.పి.ఎల్. అనే సినిమా ద్వారా ప్రోత్స‌హించారు ఈ చిత్రం మంచి ప్ర‌జాదార‌ణ‌ పొందాల‌ని ఐ విష్ యు అ గుడ్ ల‌క్ అండ్ ఆల్ ది బెస్ట్...

డైరెక్ట‌ర్ సురేష్ మాట్లాడుతూ...ఈ సినిమా అవ‌కాశం క‌ల్పించిన‌ నిర్మాత‌ల‌కు ధ‌‌న్య‌వాదాలు  ఈ సినిమా విజ‌యం సాదించడానికి క‌ష్ట‌ప‌డ‌తాన‌ని తెలియ‌జేసారు...Comments

FOLLOW
 TOLLYWOOD