రోజా హోమ్ మంత్రి అట
TOLLYWOOD
 TOPSTORY

రోజా హోమ్ మంత్రి అట

Murali R | Published:November 17, 2017, 5:35 PM IST
అసలు ప్రభుత్వమే రాలేదు కానీ అప్పుడే జగన్ పార్టీ లో మంత్రి పదవుల పంపకం జరుగుతోంది విచిత్రంగా . రోజా ని హోమ్ మంత్రి గా నియమిస్తాడని గుసగుసలు బయలు దేరాయి , రోజా కు హోమ్ మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నాడో కూడా సెలవిస్తున్నారు అక్కడి జనాలు . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి ని హోమ్ మంత్రిగా నియమించాడు , అలా రాజశేఖర్ రెడ్డి కి కలిసి వచ్చింది అంతే సెంటిమెంట్ అయ్యింది కూడా.

కట్ చేస్తే ....... ఇప్పుడు జగన్ కూడా తండ్రి బాటలో పయనించడం ఖాయమని అంటున్నారు , రోజా కు హోమ్ మినిష్టర్ పదవి కట్టబెట్టడం ఖాయమని అంటున్నారు . ఇక రోజా కూడా వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి రావడం ఖాయం , జగనన్న ఏ బాధ్యత అప్పగిస్తే దాన్ని తూచా తప్పకుండా నిర్వర్తిస్తానని స్పష్టం చేస్తోంది . అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగాలంటే ఇంకా సంవత్సరం నర టైం ఉంది అప్పుడు ఎవరు గెలుస్తారో ? ఏమో ? కానీ అప్పుడే పదవుల పంపకాలు జరుగుతూన్నాయి.Comments

FOLLOW
 TOLLYWOOD