రోజా చేత ఆ పాత్ర చేయిస్తారట
TOLLYWOOD
 TOPSTORY

రోజా చేత ఆ పాత్ర చేయిస్తారట

Murali R | Published:October 12, 2017, 9:12 AM IST
మాజీ హీరోయిన్ , వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎం ఎల్ ఏ రోజా అంటే టిడిపి నాయకులకు హడల్ ఎందుకంటే మగరాయుడు లా కడిగిపడేస్తుంది , అంతేనా అంతకుమించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరింత వివాదాస్పదం అయ్యింది. అయితే గతకొంతకాలంగా సైలెంట్ అయిపోయింది రోజా . నంద్యాల ఉప ఎన్నికల సమయంలో రోజా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కి నష్టం చేసాయి దాంతో కొద్దిరోజులు సైలెంట్ గా ఉండమని గట్టిగా చెప్పారట. 
 
 
ఇక తాజా విషయానికి వస్తే దర్శకులు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాని నిర్మిస్తుంది జగన్ పార్టీ నాయకుడు కావడంతో పాటుగా చంద్రబాబు ని విలన్ గా చూపించే సినిమా కాబట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో రోజా ని నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రోజా కూడా ఆ వివాదాస్పద పాత్ర చేయడానికి రెడీ అవడం ఖాయం ఎందుకంటే చంద్రబాబు అంటే రోజా కు పీకల దాకా కోపం కాబట్టి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేయడం వల్ల అధికార తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టవచ్చ ని నమ్ముతున్నారు జగన్ అండ్ కో. మరి ఏమౌతుందో చూడాలి. Comments

FOLLOW
 TOLLYWOOD