షూటింగ్ కి శ్రీకారం చుట్టిన రుణం
TOLLYWOOD
 TOPSTORY

షూటింగ్ కి శ్రీకారం చుట్టిన రుణం

Murali R | Published:October 19, 2017, 7:07 PM IST
గోపికృష్ణ , మహేంద్ర , శిల్ప , తేజు , ప్రియాంక హీరో హీరోయిన్ లుగా ఎస్ . గుండ్రెడ్డి దర్శకత్వంలో బెస్ట్ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై భీమనేని సురేష్ - జి . రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ''రుణం ''. పూజా కార్యక్రమాల అనంతరం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు . ఆ సందర్బంగా నిర్మాతలు భీమనేని సురేష్ , రామకృష్ణారావు లు మాట్లాడుతూ '' దర్శకులు గుండ్రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం . రామోజీ ఫిలిం సిటీ లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సినిమా మొత్తం సింగిల్ షడ్యూల్ లో ప్లాన్ చేసాం . మానవీయ కోణానికి హాస్యాన్ని జోడించి చేస్తున్న సినిమా ఈ రుణం అన్నారు . 
 
 
దర్శకుడు గుండ్రెడ్డి మాట్లాడుతూ '' కన్నడంలో నాలుగు సినిమాలకు , హిందీ లో ఒక సినిమాకు దర్శకత్వం వహించాను ఇప్పుడేమో ఈ రుణం చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను . మానవ సంబంధాల నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది , నన్ను దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్న నిర్మాతలకు రుణపడి ఉంటానన్నారు . రుణం చిత్రంతో హీరో, హీరోయిన్ లుగా పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలిపారు హీరో హీరోయిన్ లు . ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఎస్వీ మల్లిక్ తేజ , సమర్పకులు గాలిరెడ్డి లు పాల్గొన్నారు .Comments

FOLLOW
 TOLLYWOOD