హిట్ కొట్టినందుకు సంతోషంగా ఉన్నాడు
TOLLYWOOD
 TOPSTORY

హిట్ కొట్టినందుకు సంతోషంగా ఉన్నాడు

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST
దాదాపు పదమూడేళ్ల కెరీర్ అయినప్పటికీ గత దశాబ్ద కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు పూరి జగన్నాధ్ తమ్ముడు హీరో సాయిరాం శంకర్ . అయితే ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన విజయం ఎట్టకేలకు నేనోరకం చిత్రంతో వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాడు . ఈనెల 17న రిలీజ్ అయిన నేనోరకం చిత్రానికి హిట్ టాక్ వచ్చింది . పైగా రివ్యూస్ కూడా బాగా వచ్చాయి అయితే అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు లేనప్పటికీ కొంచెం పికప్ అయ్యాయి . గత పదేళ్లుగా సాయిరాం శంకర్ నుండి వస్తున్న చిత్రాలన్నీ ప్లాప్ బాట పడుతుండటం వల్ల ఈ నేనోరకం సినిమాకు కాస్త ఆలస్యంగా కలెక్షన్లు పెరగడం మొదలయ్యాయి .
 
 

నేనోరకం సినిమాకు హిట్ టాక్ రావడంతో అటు దర్శక నిర్మాతలతో పాటు సాయిరాం శంకర్ అలాగే పూరి జగన్నాధ్ కూడా సంతోషంగా ఉన్నారట . ఇన్నాళ్లకు తమ్ముడికి మంచి హిట్ దొరికిందని సంతోష పడుతున్నాడు పూరి .
Comments

FOLLOW
 TOLLYWOOD