సమంత అన్న సినిమా వస్తోంది
TOLLYWOOD
 TOPSTORY

సమంత అన్న సినిమా వస్తోంది

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST
సమంత అన్న నటించిన సినిమా ఈనెల 11న రిలీజ్ కి సిద్ధమైంది , దాంతో తన అన్నయ్య కు శుభాకాంక్షలు అందజేస్తోంది సమంత . ఇంతకీ సమంత అన్నయ్య ఎవరు ? ఎప్పుడు సినిమాల్లోకి వచ్చాడు ? అప్పుడే సినిమా రిలీజ్ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా ? ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే సమంత అన్న రానా . నాగచైతన్య - రానా ఇద్దరు కూడా బావా బావమరుదులు అన్న విషయం తెలిసిందే . 
 

అంటే రానా సమంత కు అన్న వరుస అవుతాడన్న మాట ! తేజ దర్శకత్వంలో రానా నటించిన నేనేరాజు నేనే మంత్రి సినిమా ఆగస్టు 11న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తూ రానాకు శుభాకాంక్షలు అందజేసింది . రానా కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు . మరి పోటీ ఎక్కువగా ఉన్న సమయంలో రానా సినిమా హిట్ అవుతుందా ? లేదా ? చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD