వచ్చే నెలలో సంతోషం వేడుకలు
TOLLYWOOD
 TOPSTORY

వచ్చే నెలలో సంతోషం వేడుకలు

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST
2002 సంవ‌త్స‌రంలో `సంతోషం` సినీ మ్యాగ‌జైన్ కు తొలి అడుగు పడింది. తొలి వార్షికోత్స‌వం అత్యంత వైభంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా..లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు స‌మ‌క్షంలో `సంతోషం` తొలి పుస్త‌కం ఆవిష్కృత‌మైంది. త‌ర్వాత‌  హేమా హేమీల చేతుల మీదుగా `సంతోషం` అలా..అలా చేతులు మారింది. క‌వ‌ర్ పేజీ అదిరింది. ఇంకేముంది సంతోషం తొలి పుస్త‌కాన్ని నేనే కొంటానంటూ హాస్య చిత్రాల ద‌ర్శ‌కుడు ఈ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ ముందుకొచ్చారు. అప్ప‌ట్లోనే 500 రూపాయ‌ల‌ను వెచ్చించి తొలి `సంతోషం`ను  సొంతం చేసుకున్నారు.  ఈ తొలి వార్షికోత్స‌వానికి సుమ, సునీత వ్యాఖ్య‌త‌ల‌గా వ్వ‌వ‌హ‌రించారు.

కాగా కాగా 16వ సంతోషం సౌత్ ఇండియ‌న్ ఫిలిం అవార్డ్స్ వేడుక వ‌చ్చే నెల‌( ఆగ‌స్టు)లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.Comments

FOLLOW
 TOLLYWOOD