కథను నమ్మి విలువలతో ఈ సినిమా తీసా అంటున్న ఆ దర్శకుడు...! ఏ సినిమా ..?
TOLLYWOOD
 TOPSTORY

కథను నమ్మి విలువలతో ఈ సినిమా తీసా అంటున్న ఆ దర్శకుడు...! ఏ సినిమా ..?

Murali R | Published:May 19, 2017, 12:00 AM IST
సినిమా, ఈ కాలం లో పవర్ ఫుల్ మాధ్యమం. సమాజం లో మార్పు కైనా, అదే సమాజం లో మానవత విలువలు తెలియజెప్పటానికి అయినా వారధి గా నిలుస్తుంది మన సినిమా. అటువంటి సినిమాని సమాజ శ్రేయస్సు తో పాటు, విలువలు, కామెడి జత కలిపి నేటి తరం ప్రేక్షకులను ఏంతలా అలరించవచ్చో ఈ సినిమా నిరూపించిది. అవును, ఒక మంచి కథ తో చిన్న సినిమా గా మొదలై విడుదల అయిన ట్రైలర్ అండ్ సాంగ్స్ తో ఇండస్ట్రీ లో ఈ రోజు పెద్ద సినిమా గా నిలబడింది. అదే గోదావరి సినిటోన్ బ్యానర్ పై డాక్టర్ కలపటపు శ్రీ లక్ష్మి ప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాస్ రావు లు సంయుక్తంగా యం.వి సతీష్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా మన ''మిక్షర్ పొట్లం''
 

ఈ సినిమా పై ఒక్కసారిగా  భారీ అంచనాలు నెలకొన్న తరుణం లో దర్శకుడు యం.వి సతీష్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ '' నేను కేవలం కథ ను నమ్మి ఈ సినిమా ను మొదలు పెట్టాను, మా నిర్మాతలు సైతం నేను ఏంతగానో ప్రేమించి, నమ్మిన నా కథ మీద నమ్మకం తో ఈ సినిమా పై పెట్టుబడులు పెట్టారు. మా సినిమా కి తొలుత నుండి మా వెంటే వుండి ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయి లో నిలిపిన మీడియా సోదరులకు నా ప్రత్యెక కృతజ్ఞతలు. నాకు తెలిసి విలువ కలదే తోలి విజయం, 

చాలా మంది ట్రైలర్ లో ఓ రేంజ్ యాక్షన్ పార్ట్ చూపించి, కామెడీ టైటిల్ పెట్టారెంటి అని నన్ను అడిగారు, ఇంత పెద్ద సినిమాకు నేను మిక్షర్ పొట్లం అనే టైటిల్ ఏందుకో పెట్టానో సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు చెప్తారు. సినిమా అంటే 66 కళలు, నవ రసాలు మేళవించిన ఒక మధురమైన రుచి కలిగిన మిక్షర్ పొట్లం లాంటిదే. వారంతం లో హాయిగా నవ్వుకుందాం అని సినిమాకు వచ్చే ఆడియెన్ కి మనఃస్పూర్తిగా ఆహ్లాదాన్ని పంచె సినిమా మాది. మంచి కథ ఉంది, మన సమాజం లో నేడు జరిగే వాస్తవాలు ఉన్నాయి, రాజకీయ కుంభకోణాలు, మారిపోయే ప్రజల స్తితీగతులు, ప్రతిది ప్రేక్షకులను  ఆలోచింపచేస్తుంది. ఈ కాలం సినిమాకు ఇండస్ట్రీ వర్గాలే ఒక ముద్ర వేసాయి, పెద్ద సినిమా, గోప్ప  సినిమా, మంచి సినిమా అని...  కాని మాది మంచి కథ, గొప్ప గొప్ప విలువలు, పెద్ద మనుషుల ఆశీర్వాదాలు మా సినిమా పై ఉన్నాయి. గోదావరి అందాలు, మరియు  పెద్దలు, గురువు గారు మాధవ పెద్ది సురేష్ గారి సంగీతం మా సినిమాకు మరోక హైలెట్. ఆ నమ్మకం తోనే ఈ నెల 19 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా  విడుదల చేస్తున్నాం. 

 

ప్రేక్షకులు మా మీద పెట్టుకున్న అంచనాలు, మా సినిమా విజయం తో ఆనంద క్షణాలుగా మారతాయి'' అని తెలిపారు. 

 

చాలా భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా మీద ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో సైతం అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మధ్య చెన్నై ప్రిమియర్ షో లో సైతం తమిళ సూపర్ స్టార్ లు, ప్రముఖ నటులు చారు హసన్, భాగ్య రాజ్, భాను చందర్, నటి పూర్ణిమ, నటి లిజి, హీరో అమిత్, ఇంకా మరెందరో  ఈ సినిమా చూసి మంచి సినిమా, ఘనమైన విజయం అని దివించారంటే ఈ సినిమా ఏ స్థాయి లో ఉండబోతుందో ఇప్పటికే మనకు అర్ధమవుతుంది.
Comments

FOLLOW
 TOLLYWOOD