నిఖిల్ ఇంకో హీరోయిన్ ని పట్టాడు
TOLLYWOOD
 TOPSTORY

నిఖిల్ ఇంకో హీరోయిన్ ని పట్టాడు

Murali R | Published:October 22, 2017, 6:36 PM IST
విభిన్న తరహా చిత్రాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్న నిఖిల్ తాజాగా కన్నడంలో సూపర్ హిట్ అయిన కిర్రాక్ పార్టీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు . కొత్త దర్శకుడు కొప్పిశెట్టి శరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ లు కాగా అందులో ఒకరు సంయుక్తా హెగ్డే గా ఎంపిక చేసి ఓ షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసారు ఇక ఇప్పుడేమో రెండో హీరోయిన్ ని ఎంపిక చేసారు . ఇంతకీ సెకండ్ హీరోయిన్ ఎవరో తెలుసా ........ సిమ్రాన్ పరీంజ . హిందీలో పలు సీరియల్ లలో నటించిన సిమ్రాన్ ని నిఖిల్ సరసన ఎంపిక చేసారు . 
 
 
 
శరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై నిఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు , ఎందుకంటే కేశవ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాడు కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు సినిమా కానీ అందరికీ లాభాలు వచ్చాయి . దాంతో ఈ రీమేక్ తో సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు నిఖిల్ . అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి మాటలు అందిస్తుండగా మరో దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు . నిఖిల్ కు ఈ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కావడంతో ఆ సహకారం అందిస్తున్నారు .Comments

FOLLOW
 TOLLYWOOD