ఫిదా సీక్వెల్ చేస్తాడట
TOLLYWOOD
 TOPSTORY

ఫిదా సీక్వెల్ చేస్తాడట

Murali R | Published:August 17, 2017, 12:00 AM IST
రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తున్న సంచలన చిత్రం '' ఫిదా '' . ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట దర్శకులు శేఖర్ కమ్ముల . ఫిదా పెద్ద హిట్ అవ్వడంతో ఇప్పుడు పలువురు నిర్మాతలు శేఖర్ కమ్ముల దగ్గర పెద్ద క్యూ కడుతున్నారు , మీ నెక్స్ట్ సినిమా మాకే చేయాలి అంటే మాకే చేయాలి అంటూ అలాగే ఫిదా లాంటి ప్రేమ కథా చిత్రమే చేద్దామని కూడా అంటున్నారట .
 

వరుణ్ తేజ్ కెరీర్ లోనే కాదు శేఖర్ కమ్ముల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది ఫిదా చిత్రం . దాంతో ఇప్పుడు అందరి చూపు అలాంటి చిత్రాల మీదే పడింది . అందుకే ఫిదా కు సీక్వెల్ చేసే ఆలోచనలో పడ్డాడట శేఖర్ కమ్ముల . ఫిదా కు సీక్వెల్ చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాకు  ఫిదా అయిపోయేలా ఉండాలి మరి శేఖర్ ఎలాంటి సీక్వెల్ చేస్తాడో చూడాలి .
Comments

FOLLOW
 TOLLYWOOD