47 ఏళ్ల వయసులో పెళ్లి అంటున్న హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

47 ఏళ్ల వయసులో పెళ్లి అంటున్న హీరోయిన్

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST
47 ఏళ్ల వయసు లో పెళ్ళికి సిద్ధం అవుతోంది మాజీ హీరోయిన్ శోభన . 90వ దశకంలో హీరోయిన్ గా సత్తా చాటిన శోభన పెళ్లి చేసుకోలేదు ఇన్నాళ్లు ఇలాగే కాలం వెళ్లదీసింది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శోభన కు పెళ్లి మీద గాలి మళ్లినట్లు వార్తలు వస్తున్నాయి . భరతనాట్యం లో ప్రావీణ్యం సాధించిన శోభన పలు ప్రదర్శనలు ఇచ్చింది . తెలుగు , తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ కొద్దికాలం క్రితం ఓ బిడ్డ ని దత్తత కూడా తీసుకుంది.

ప్రస్తుతం భరతనాట్యం పాఠశాల నిర్వహిస్తున్న శోభన తనకు కాబోయే జతగాడిని సెలక్ట్ చేసుకుందని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని అంటున్నారు . అయితే ఈ వార్త అధికారికంగా శోభన ప్రకటించాల్సి ఉంది . మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత నైనా పెళ్లి కి అంగీకరించినందుకు శోభన ని అభినందించాల్సిందే.Comments

FOLLOW
 TOLLYWOOD