పవన్ తో పోటీ పడుతున్న శర్వానంద్
TOLLYWOOD
 TOPSTORY

పవన్ తో పోటీ పడుతున్న శర్వానంద్

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST

ఇప్పటికే సంక్రాంతి బరిలో రెండుసార్లు దిగి విజయాలు అందుకున్న శర్వానంద్ తాజాగా మరోసారి అగ్ర హీరోల తో పోటీ పడటానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో పోటీ పడిన శర్వానంద్ తాజాగా పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో పోటీ పడనున్నాడు. పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రం మార్చిలో రిలీజ్ కానుంది . ప్రభాస్ బాహుబలి 2 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది కాగా శర్వానంద్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాన్ని ఆ ఇద్దరికీ పోటీగా రిలీజ్ చేసే పనిలో పడ్డాడట.

భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వా ఈసారి పవన్ తో పోటీ పడి విజయం సాధిస్తాడా ? లేదా ?చూడాలి.
Comments

FOLLOW
 TOLLYWOOD